![]() |
![]() |

ఢీ సెలబ్రిటీ షో ప్రతీ వారం డాన్స్ తో పాటు స్కిట్స్ కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ఇక ఈ షోకి జడ్జెస్ గా ప్రణీత, శేఖర్ మాష్టర్ వచ్చి తమ జడ్జిమెంట్ తో అప్పుడప్పుడు డాన్స్ తో ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటారు. అలాంటి జడ్జి ప్రణీత తన ఇన్స్టాగ్రామ్ పేజీలో "వాట్సప్" అని ఫాన్స్ ని అడిగేసరికి నెటిజన్స్ వాళ్ళ వాళ్ళ ప్రశ్నలను అడగడం స్టార్ట్ చేశారు "ఢీ ఫామిలీలో ఒక భాగమైనందుకు ఎలా ఫీలవుతున్నారు" " చాలా బాగుంది. ఇక ఫోటో మా హజ్బెండ్ ది, నందు, కెమెరా టీమ్ వాళ్ళు బ్రేక్ టైములో సరదాగా ఇలా నన్ను ఆటపట్టిస్తూ ఉంటారు" అని చెప్పింది. "మీ కూతురిని మిస్ అవుతున్నారా" " ఎస్.. ఎప్పుడు జర్నీ చేసినా పాప గుర్తొస్తుంది..అందుకే ఉదయం వెళ్ళిపోయి మళ్ళీ రాత్రికి తిరిగి రిటర్న్ వచ్చేసి పాపతో టైం స్పెండ్ చేస్తాను" అని చెప్పింది.
"ఇస్తాంబుల్ ట్రాఫిక్ గురించి మీ అభిప్రాయం" " పర్లేదు" "బ్యాంకాక్ లో ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది. అందుకే నేను టైం సేవ్ చేసుకోవడం కోసం చిన్న చిన్న ఆటోల్లో వెళ్తుంటాను" అని చెప్పింది. "మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు " "మా నాన్న మా హాస్పిటల్లో పాతికేళ్లుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిరవిస్తూ 140 సార్లుకు పైగా ఆయన కూడా బ్లడ్ డొనేట్ చేశారు" అని చెప్పింది. "మీరు మా బాస్ దర్శన్ కాంబినేషన్ సూపర్" "ఆల్వేస్ ది బెస్ట్" అంది. "కన్నడలో మరిన్ని సినిమాలు చేయండి" "ఎస్ ..రమణ అవతారతో త్వరలో" అంది. ఐతే రీసెంట్ గా ఒక ట్రాన్స్పరెంట్ శారీలో కనిపించింది ప్రణీత. ఆ శారీ లుక్ లో ప్రణీత్ రాణిలా ఉందని కామెంట్స్ చేశారు. ఈ శారీలో రీల్స్ చేశారా అని అడిగేసరికి ఎలాంటి రీల్స్ చేయలేదు అని చెప్పింది. ఇక చెప్పాలంటే ప్రణీత సుభాష్ కెరీర్ కి కొంత బ్రేక్ వచ్చింది. ఐతే ఇప్పుడు ఆమె మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె "రామన అవతార" అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మలయాళ నటుడు దిలీప్ కుమార్ కి జంటగా ఒక మూవీలో కనిపించబోతున్నారు.
![]() |
![]() |